ముంబై డ్రగ్స్ కేసులో స్టార్ హీరో మహేశ్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసులో నమ్రత పేరును జాతీయ మీడియా ప్రస్తావించింది. టాలెంట్ మేనేజర్ జయ సాహాతో డ్రగ్స్ విషయమై నమ్రత చాట్ చేసినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ‘బాంబేలో మంచి ఎండీ ఇస్తావని ప్రామిస్ చేశావ్. ఎండీ ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందాం’అని నమ్రత చాటింగ్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కొందరు సినీ నటులు, డ్రగ్స్ పెడ్లర్లను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారిస్తోంది.
తాజాగా జయ సాహాని ఎన్సీబీ విచారిస్తుండగా నమ్రత పేరు బయటికొచ్చినట్టు సమాచారం. కొందరు సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు సాహా వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ముంబై డ్రగ్స్ కేసులో నటి దియా మీర్జా పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్సీబీ అధికారులు దియాను, ఆమె మేనేజర్‌ను విచారణకు పిలిచే అవకాశముంది. 2019లో దియా డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. దియాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీకరించిన డ్రగ్ డీలర్స్ ఎన్సీబీ అధికారుల విచారణలో వెల్లడించారు.