ఇటీవలే ఎన్టీఆర్‌ను గౌరవం లేకుండా సంభోదించాడు అంటూ ఆదర్శ్ బాలకృష్ణపై నందమూరి ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆదర్శ్ బాలకృష్ణ చివరకు ఎన్టీఆర్‌ను అన్న అంటూ పిలవడంతో ఫ్యాన్స్ కాస్త తగ్గారు. ఇప్పుడు అదే పరిస్థితి పూజా హెగ్డే మరియు మహేష్‌బాబు ఫ్యాన్స్ మద్య నడుస్తోంది. తాజాగా మహేష్‌బాబు బర్త్‌డే సందర్బంగా హీరోయిన్ పూజా హెగ్డే బర్త్‌డే విషెష్ చెబుతూ ఒక పోస్ట్ పెట్టింది. రిషి అంటూ మహేష్‌బాబును పిలుస్తూ బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పింది. అయితే పూజా చేసిన పోస్ట్‌లో మహేష్‌ను గౌరవించలేదు అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’లో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. మహర్షి చిత్రంలో మహేష్‌బాబు రిషి పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకే పూజా హెగ్డే హ్యాపీబర్త్‌డే రిషి అంటూ పోస్ట్ చేసింది. దాంతో ఫ్యాన్స్ మహేష్ సర్ అని పిలవలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్‌ను ఇంకా చాలా మంది కూడా పేరు పెట్టి పిలిచి బర్త్‌డే విషెష్ చెప్పారు. కాని వారిని ఎవరిని టార్గెట్ చేయని మహేష్ బాబు ఫ్యాన్స్ పూజా హెగ్డేను మాత్రమే టార్గెట్ చేయడంతో ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పనిని మహేష్ బాబు ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మహేష్‌బాబు ఫ్యాన్స్ కాస్త తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. పూజా హెగ్డే ఈ విషయంలో సైలెంట్‌గా ఉండే అవకాశం కనిపిస్తుంది.