వెయిటింగ్ కన్నా ఆ కామెంట్ తో పవన్ కి బాధ…

Mahesh Kathi Comments On Pawan kalyan Over Waiting For KCR

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
“ మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు” అన్న ఓ పాత సామెత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో అక్షరాలా నిజమైంది. కొత్త ఏడాది తొలిరోజున 24 /7 రైతులకు కరెంటు ఇస్తున్న తెలంగాణ సీఎం కెసిఆర్ ని అభినందించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రగతి భవన్ కి వెళ్లారు. నాలుగు మంచి మాటలు చెప్పడానికి వెళుతున్నాం కదా ఆతిధ్యం అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని అనుకునివుంటారు. నిజంగానే ఆతిధ్యంలో ఏ లోటు లేదు కానీ సీఎం కెసిఆర్ గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్లడంతో ఓ గంట పాటు పవన్ గెస్ట్ రూమ్ లో నిరీక్షించక తప్పలేదు. అయితే వెయిటింగ్ చేయించడమే వెయిట్ చేయడం అనేది పవన్ కి చాలా ఏళ్ల తర్వాత అనుభవంలోకి వచ్చింది. అమరావతి వెళ్లినా ఏపీ సీఎం చంద్రబాబు కాచుకుని ఉండటంతో ఇక్కడా అలాగే ఉంటుందని పవన్ అనుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ కెసిఆర్. కారణాలు ఏమైనా పవన్ కి ఓ గంట పైన వెయిటింగ్ తప్పలేదు. ఎలాగో ఆ వెయిటింగ్ ని భరించాం అనుకుంటే ఆ విషయం బయటకు రావడం పవన్ ని ఇబ్బంది పెడుతోంది.

సరే ఓ సీఎం కోసం గంట వెయిట్ చేయడం సహజమేలే అని పవన్ సర్దుకుపోదాం అనుకున్నా ఆలా జరగనివ్వకుండా అడ్డుపడుతున్నారు చాలా మంది. అందులో కత్తి మహేష్ గురించి వేరే చెప్పాలా ? పవన్ , ఆయన ఫాన్స్ మీద కొన్నాళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్న కత్తి మహేష్ ఈ టాపిక్ మీద కూడా పవన్ కి మంటెత్తేలా కామెంట్స్ చేశారు. “ ప్రగతి భవన్ లో పవన్ కళ్యాణ్ పడిగాపులు ముఖ్యమంత్రికి విషెస్ చెప్పడానికా ? అజ్ఞాతవాసి ప్రీమియర్ పెర్మిషన్స్ కా ? అని కత్తి మహేష్ ఫేస్ బుక్ లో పెట్టిన కామెంట్ తో పవన్ ఫాన్స్ కి మండిపోతోంది. ఫాన్స్ కి అలా అనిపిస్తే ఇక పవన్ కి ఎంతలా బాధపెడుతుందో ఆ కామెంట్. మొత్తానికి కెసిఆర్ వెయిట్ చేయించడం కన్నా కత్తి కామెంట్స్ పవన్ గుండెల్లో కత్తిలా గుచ్చుకుంటున్నాయి.