మళ్ళీ వెనక్కెళ్ళిన మహర్షి !

Mahesh Maharshi Movie Release Date Postponed

మహర్షి సినిమాకి రిలీజ్ డేట్ మళ్ళీ మారింది. షూటింగ్ పూర్తి కావొస్తున్న మహర్షి సినిమా మే 9న రిలీజ్ చేస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఈ సినిమా టాకీ మార్చి 17కి పూర్తవుతుందని రెండు పాటలు, హైదరాబాద్ లో షూట్ చేస్తామని, అవి సెట్ సాంగ్స్ అని అన్నారు. అలాగే ఈ సినిమా మొదలు పెట్టినపుదు ఉగాది కానుకగా రిలీజ్ చేద్దామని అనుకున్నామని అమెరికా వీసాలు దొరక్క ఒక నెల షెడ్యూల్ ఆలస్యం కావడం వలన ఆ ఎఫెక్ట్ రిలీజ్ డేట్ మీద పడిందని ఆయన అన్నారు.

ఏప్రిల్ 25న చేద్దామనుకున్నా మని కానీ ఇంత కష్టపడిన సినిమాని హడావుడిగా పోస్ట్ ప్రొడక్షన్ చేయలేమని అందుకే వంశీ, మహేష్ టీం అంతా కూర్చుని రిలీజ్ మే 9న రచేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అలాగే ఇక మహర్షి చిత్రానికి సెంటిమెంట్ కూడా కలసి వస్తోందని అశ్విని దత్ కు మే 9 బాగా కలసివచ్చిందని అప్పట్లో జగదేకవీరుడు అతిలోక సుందరి, ఆ తర్వాత గత ఏడాది వచ్చిన మహానటి చిత్రాలు ఘనవిజయం సాధించాయని ఇక నాకు కూడా మే నెల బాగా కలసివచ్చింది. భద్ర, పరుగు, ఆర్య లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఈ మే నెలలోనే విడుదలైనట్లు దిల్ రాజు తెలిపారు.