దిలీప్ కి బెయిల్…రామ్ లీలా హిట్.

malayalam-actor-dileep-ramaleela-is-a-hit-some-relief-for-the-jailed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటి భావన కిడ్నాప్ కేసులో ఎట్టకేలకు మళయాళ హీరో దిలీప్ కి బెయిల్ వచ్చింది. ఆయనకి బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హై కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే కొన్ని షరతులు కూడా పెట్టింది. పాస్ పోర్ట్ అప్పగించడం, లక్ష పూచీకత్తు తో పాటు సాక్షుల్ని ప్రభావితం చేయకుండా వుండాలని కోర్టు దిలీప్ కి సూచించింది. ఇంతకుముందు ట్రయల్ కోర్టులో రెండు సార్లు, హై కోర్ట్ లో రెండు సార్లు దిలీప్ బెయిల్ పిటీషన్ ని కొట్టివేశారు. 5 వ సారి దిలీప్ కి బెయిల్ వచ్చింది. జులై 10 న దిలీప్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. నటి భావన ని కిడ్నాప్ చేసి ఆమెని లైంగికంగా వేధించిన కేసులో సూత్రధారి దిలీప్ అన్న ఆధారాలు దొరకడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. భావన కిడ్నాప్ కేసు యావత్ దేశాన్ని, ముఖ్యంగా సినీ రంగాన్ని ఓ కుదుపు కుదిపింది.

దిలీప్ కి బెయిల్ మంజూరుతో పాటు జైలు నుంచి వచ్చేసరికి ఇంకో గుడ్ న్యూస్ కూడా రెడీ గా వుంది. ఆయన జైలులో ఉండగానే విడుదల అయిన రామ్ లీలా సినిమా మంచి హిట్ అయ్యింది. కేరళతో పాటు బెంగుళూరు, చెన్నై లలో ఈ సినిమా కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. దిలీప్ విడుదల అయ్యాకే ఈ సినిమా రిలీజ్ చేద్దామని నిర్మాతలు భావించారు. కానీ మూడు నాలుగు సార్లు బెయిల్ రాకపోవడంతో సెప్టెంబర్ 28 న సినిమా విడుదల చేశారు.