భారత్ ను పక్కన పెట్టేసిందా ?

Maldives Signs Big Power Deal with Pakistan

మాల్దీవులకి భారత్ కి మధ్య ఉన్న స్నేహ సంబంధాలు అంతతకు చెడుతున్నాయి. హిందూ మహాసముద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న మాల్దీవుల వైఖరిలో వచ్చిన మార్పులే అందుకు కారణంగా తెలుస్తోంది. గతంలో భారత్ అందజేసిన హెలికాప్టర్లను వెనక్కు పంపడం, భారతీయులకు వర్క్ వీసాలను నిరాకరించడం లాంటి చర్యలను చూసి భారత్ ఇప్పటికే కోపంగా ఉండగా మరోసారు తాజాగా ఆ దేశం విద్యుత్ రంగంలో పాకిస్థాన్‌తో సామర్థ్య నిర్మాణ ఒప్పందం చేసుకుంది. మాల్దీవుల ప్రభుత్వ విద్యుత్ సంస్థ స్టెల్కో అధికారులు గత వారం పాకిస్థాన్‌లో పర్యటించిన దీనిపై ఒప్పందం కుదుర్చుకున్నారు.

మాల్దీవుల్లో భారత్ నిర్మిస్తోన్న పోలీస్ అకాడమీ లాంటి ప్రాజెక్టుల్లో పనిచేయడానికి భారతీయులకు వీసాలను నిరాకరించిన ఇలాంటి తరుణంలోనే పాకిస్థాన్‌తో ఒప్పందం చేసుకోవడం ఇప్పుడు రెండు దేశాల మధ్య అంతరాలను పెంచే సూచనలు కనిపిస్తోంది. స్టెల్కో భారీ ప్రాజెక్టులన్నీ ఇప్పటికే చైనా అధీనంలో ఉండగా, మరి పాకిస్థాన్ నుంచి మాల్దీవులు అశిస్తున్నది ఏంటో భారత్ గుర్తించింది. అందుకే ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలు పరిస్థితి ఏమిటా అన్నది సందేహంగా మారింది.