రోజు రోజుకీ సేల్ఫీ మరణాలు ఎక్కువవుతున్నాయి. ఒకానొక సమయంలో చనిపోతుంటే లేఖ రై చనిపోయేవారు ఇప్పుడు సేల్ఫీ వేడియో తీసుకుని క్షణాల వ్యవధిలో చనిపోతున్నారు. ప్రియురాలు మోసం చేసిందని ఓ 25 ఏళ్ల యువకుడు ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే ముంబైలోని కళ్యాణ్ సమీపంలో అంబివ్లీ ప్రాంతానికి చెందిన రాజేశ్ ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. అయితే రాజేశ్, అతని ప్రియురాలికి మధ్య ఇటీవలే గొడవ అయింది జూలై 26న ఆమె రాజేశ్‌కు ఫోన్ చేసి వితుల్ వాడీ స్టేషన్‌కు రావాలని కోరింది. స్టేషన్‌లో వారిద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది.
దీంతో అక్కడే ఉన్న రైల్వే పోలీసులు వారిద్దరిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే రాజేశ్ తన ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రియురాలు తనని చీట్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. తర్వాత తన సోదరుడు, మిత్రుడితో మాట్లాడి తన ఫోన్ పాస్‌వర్డ్‌ను మిత్రుడితో చెప్పి, స్విచ్‌ఆఫ్ చేసి లోకల్ ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేష్ ఆరోజునే ఆత్మహత్య చేసుకున్నా ఆ ఘటన తర్వాత పోలీసులు శవాన్ని, శవంతో పాటు ఉన్న ఫోన్ నీ స్వాధీనం చేసుకుని పంచనామా పూర్తయ్యాక తిరిగిచ్చారు. దీంతో ఆరోజున తీసిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది.