వ్యక్తి ఆత్మహత్య

వ్యక్తి ఆత్మహత్య

మరదలితో కలిసి భార్య చిన్నచూపు చూసిందని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 2లోని సయ్యద్‌నగర్‌ ఫస్ట్‌ లాన్సర్‌లో నివసించే సయీద్‌బిన్‌ మాబ్రుక్‌ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. ఈ నెల 9న భార్య షాహిన్‌ బేగం గొడవ పడి తన చెల్లెలు ఇంటికి వెళ్లింది.

దీంతో ఈ నెల 12వ తేదీన రాత్రి తన భార్యను తీసుకురావడానికి సయీద్‌ అక్కడికి వెళ్లిగా భార్యతో పాటు ఆమె చెల్లెలు కించపరిచారు.అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన సయీద్‌ తెల్లవారుజామున తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడి ఆత్మహత్యకు భార్య, తోడల్లుడు, ఆయన మరదలు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలంటూ మహ్మద్‌ బిన్‌ హమీద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.