రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్) బైక్ను తల్లిదండ్రులు కొనివ్వలేదనే ఆవేదనతో యువ టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కువెంపునగరలో మంగళవారం జరిగింది. వివరాలు.. టెక్కీ అజయ్ (25) ఐదేళ్లుగా బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు.
లాక్డౌన్ వల్ల ఇప్పుడు మైసూరులో ఇంటినుంచే పనిచేస్తున్నాడు. తనకు బుల్లెట్ బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులను తరచూ అడిగేవాడు. పలు కారణాల వల్ల వారు ఒప్పుకోలేదు. దీంతో అజయ్ ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.