ఇంటికి చేరనున్న వ్యక్తిని మృత్యువు వెంటాడింది

ఇంటికి చేరనున్న వ్యక్తిని మృత్యువు వెంటాడింది

మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరనున్న వ్యక్తిని మృత్యువు వెంటాడింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అతను ఆటోను తప్పించబోయి ప్రమాదవశాత్తు పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం గ్రామ సమీపంలో చోటుచేసుకోగా.. ఆదే గ్రామానకి చెందిన సెంటరింగ్‌ మీస్త్రి బైపోతు ప్రేమకుమార్‌(27) మృతి చెందినట్లు ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ తెలిపారు.

ప్రేమ్‌కుమార్‌ రోజులాగే ఆదివారం ఉదయం సెంటరింగ్‌ పనికోసం ద్విచక్ర వాహనంపై హిరమండలం మండలం ధనుపురం గ్రామానికి వెళ్లాడు. పని ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా పెద్దపద్మాపురం గ్రామ సమీపంలో ఆటోను తప్పించబోయి ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి క్షతగాత్రుడ్ని పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు.

అయితే ప్రేమ్‌కుమార్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు శ్రీధర్‌ ధ్రువీకరించారు. మృతునికి భార్య నీరజ, కుమారై శరణ్య (1) ఉన్నారు. భర్త మృతదేహంపై పడి భార్య రోదించిన తీరు స్థానికులను కలచి వేసింది. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.