మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మండల పరిధిలో కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దగ్ధం చేసిన కేసును జిల్లా పోలీసులు చేధించారు. మృతుడిని రియల్టర్ శ్రీనివాస్‌గా గుర్తించారు. గొంతు కోసి శ్రీనివాస్‌ను చంపేసినట్లు తెలిపారు పోలీసులు. ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 10న యశ్వంత్ రావ్ పెట్ గ్రామంలో మృతదేహం దొరికింది. ఆగస్టు 9 రాత్రి దగ్దం చేయడం జరిగింది. మృతదేహాన్ని రియల్టర్ శ్రీనివాస్‌దిగా గుర్తించాము. శ్రీనివాస్ భార్య మాకు ఫిర్యాదు ఇచ్చింది. ముగ్గురు నిందితులు ఈ కేసులో ఇన్వాల్ అయ్యారు. ప్రధాన నిందితుడు శివను అరెస్ట్ చేసాం. ఏ-2 పవన్, ఏ-3 నిఖిల్‌లు పరారీలో ఉన్నారు’’ అని తెలిపారు.
‘‘మృతుడు శ్రీనివాస్ మెదక్ నుంచి ఆగస్టు 9 న ఇంటి నుండి బయటకు వచ్చాడు. శివ, నిఖిల్ ఇద్దరు కార్లో శ్రీనివాస్‌ను ఎక్కించుకుని వెళ్లారు. కార్ దగ్దం చేసిన ప్రాంతంలోనే శ్రీనివాస్‌ను హత్య చేశారు. హత్య కు ప్రధాన కారణం వ్యాపార లావాదేవీలు. టెక్నీకల్ ఏవిడెన్స్, సయింటిఫిక్ ఏవిడెన్స్ ఆధారంగా కేసును ఛేదించాము. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివను పోలీసు కస్టడీకి తీసుకుంటాము. గతంలో శివపై రౌడీ షీట్ ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం కేసు విచారణ సాగుతోంది’’ అని తెలిపారు.