తాను ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమించాడని…పెన్నుతో పొడిచి చంపేశాడు !

man suicide with pen

ఏమీ తెలియని వయసులో ఏర్పడిన ప్రేమ దాని కారణంగా తలెత్తిన ఒక వివాదం ఓ హత్యకు దారితీసింది. నిండా పదిహేడేళ్లు కూడా నిండని బాలుడు తనకంటే ఏడాది పెద్దవాడయిన డిగ్రీ యువకుణ్ని పొడిచి చంపినా ఘటన జగిత్యాల జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కలకలం రేపింది. అందుతున్న సమాచారం మేరకు జగిత్యాల గ్రామీణ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన సాదినేని నవీన్‌(18) జగిత్యాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అదే గ్రామానికి చెందిన బాలుడు(17) తన వీధిలో నివసించే ఓ అమ్మాయి మీద మనసుపడ్డాడు.

suicide attempt

తాను ఇష్టపడిన అమ్మాయి కోసం నవీన్‌ తరచూ తన వీధిలోకి వస్తున్నట్టు బాలుడు గుర్తించాడు. అతన్ని నిలదీశాడు. ఇదే విషయమై కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో బాలుడు సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి నవీన్‌ నివసించే వీధిలోకి వెళ్లాడు. అందరూ మద్యం తాగినట్టు సమాచారం. అనంతరం నవీన్‌ను పిలిపించి గొడవపడ్డారు. మాటామాటా పెరగడంతో క్షణికావేశంలో బాలుడు పెన్‌ కత్తితో నవీన్‌ను పొడిచాడు. గుండె సమీపంలో కత్తి గుచ్చుకోవడంతో అపస్మారకస్థితికి చేరిన నవీన్‌ జగిత్యాల వైద్యశాలకు తరలించే లోపే మృతి చెందాడు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.