తండ్రికి తగ్గ తనయకు…పుట్టినరోజు శుభాకాంక్షలు

తెలుగు మీడియా సర్కిల్స్ ఉన్నవారికి ఎన్టీవీ గురించి గానీ, రచనా టెలివిజన్స్ గురించి కానీ పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆ సంస్థ రెప్యూటేషన్ అటువంటిది. అయితే దాదాపుగా అందరికీ తెలిసిన అంశం ఏమిటంటే రచనా తెలివిజన్స్ అనే పేరు ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఆయన కుమార్తె పేరు మీద స్థాపించారు. అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే గత ఏడాది ఆమె వివాహం జరిగే వరకు ఈ పేరు మీడియా వర్గాల వారికి తప్ప బయట వారికి పెద్దగా పరిచయం లేదు. అయితే ఆ వివాహం దెబ్బకు ఆమె పాపులర్ అయ్యారు. అయితే అందరికీ పెద్దగా తెలియని విషయం ఏమిటంటే ఆమె ఇప్పుడు ఎన్టీవీ బాధ్యతలలో కూడా పాలుపంచుకుంటున్నారు.

లండన్ లో డబుల్ పీజీ చేసిన ఆమె ఎన్టీవీ బాధ్యతల్లో పాలుపంచుకోవడమే కాక నేటి రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్న సెఫాలజీ అదేనండీ మన బాషలో పొలిటికల్ సర్వే సంస్థను కూడా ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాక కొన్ని కీలక ఎన్నికలలో సర్వేలు చేయించి అత్యత్తమ ఫలితాలను అందించారు. అంతేకాక ఆమె సంస్థ ఉద్యోగులతో మెలిగే విధానం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే వారిని ఆమె ఉద్యోగుల్లా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు కాబట్టి. ఇవే కాక ఆమె స్వచ్చంద సేవల్లో కూడా తనదైన పాత్ర పోషించడం దాదాపు అతి కొద్ది మందికే తెలిసన విషయం. ఆమె ఆధ్వర్యంలో హ్యూమన్స్ అఫ్ హైదరాబాద్, హ్యూమన్స్ ఆఫ్ ఆంద్ర ప్రదేశ్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలు నడుస్తున్నాయి. మీడియా రంగంలో ఉన్న అందరి కంటే అత్యంత భిన్నంగా చురుగ్గా స్పందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రచన గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ.