మహానుభావుడి కలరింగ్…విమానాల్లో రేప్ లు…ఇప్పుడు పోలీసుల చెరలో ?

ఆయన సంఘంలో మంచిపేరున్న వ్యక్తి పైగా కోటీశ్వరుడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే ఆయన సొంతం తనకున్న విమానాలని పేదల ఆరోగ్య అవసరాల నిమిత్తం ఉచితంగా ఎయిర్ అంబులెన్స్ లా వాడుతూ ఇస్తూ, ‘ఎయిర్ లైఫ్‌ లైన్’ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. దీంతో ఆయనో మహానుభావుడు అని నమ్మిన ఒక మహిళ అతడికి పైలట్ లైసెన్స్ కూడా ఉండటంతో తన కుమార్తెకు పైలట్ శిక్షణ ఇవ్వాలని అతడిని కోరింది.  ఇందుకు అంగీకరించిన స్టిఫెన్ అనే అతను ఆరు నెలలపాటు ఆ అమ్మాయికి శిక్షణ ఇచ్చాడు. శిక్షణ కాలంలో స్టిఫెన్ ఆమెపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. స్టిఫెన్ తన విమానాన్ని తానే స్వయంగా నడిపేవాడు. శిక్షణలో భాగంగా బాలికను మాత్రమే విమానం ఎక్కించుకునేవాడు. విమానం గాల్లో ఉన్నప్పుడు దాన్ని ఆటో పైలట్‌ మోడ్‌ లో పెట్టి ఆ తర్వాత ఆ బాలిక దుస్తులు విప్పించి అత్యాచారానికి పాల్పడేవాడు. అలా, పలు దఫాలు ఆమెతో సెక్స్‌లో పాల్గోవడమే కాకుండా, ఆమె నగ్నంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసేవాడు. శిక్షణ పూర్తయిన తర్వాత కూడా  అప్పుడప్పుడు ఆమెను న్యూజెర్సీలో సంపన్నులు నివసించే బెడ్‌మినిస్టర్‌లోని అతడి గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి సెక్స్‌ చేసేవాడు. దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. బాలికతో సెక్స్‌లో పాల్గొన్నందుకు స్టిఫెన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. స్టిఫెన్‌కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.