ఆంధ్రప్రదేశ్ లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు వస్తానని చెప్పిన ఇంట్లోంచి బయటకు వెళ్లిన తండ్రి ఇంటి సమీపంలోనే రక్తపు మడుగులో పడి ఉండటం చూసిన చిన్నారి గుండెలవిసేలా లే.. నాన్న లే.. అంటూ అరవడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. పెట్నికోట గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరి హృదయాలను కలచివేస్తుంది. మండల పరిధిలోని పెట్నికోట గ్రామం గుండు మల్లేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉండే అన్నెం కృష్ణారెడ్డి.. గ్రామంలో రైతులతో పాలు సేకరించి కొలిమిగుండ్లలోని విజయ డెయిరీకి పోసేవాడు.
ప్రతిరోజు మాదిరిగానే తాజాగా కబడా బైక్‌పై పాలు తీసుకెళ్లి త్వరగా పోసి వస్తానని చెప్పి వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో ఇంటికి 50 అడుగుల దూరంలో ఎరువు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కగా ఇంటి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో భార్య లక్ష్మేశ్వరి, కూతుళ్లు శివాని, మేఘన పరుగున వచ్చి బోరున విలపించారు. తండ్రి మృతదేహంపై పడి పెద్ద కూతురు ‘లే నాన్నా.. లే’ అంటూ రోదించిన తీరు స్థానికులను కట్టిపడేస్తుంది. కాగా విషయం తెలుసుకున్న ఎస్ఐ హరినాథరెడ్డి, వైఎస్సార్సీపీ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.