లగేజీ చార్జీ తప్పించుకోవడం కోసం తిప్పలు.. 15 చొక్కాలు ధరించి..

man wear 15 shirts to avoid paying excess baggage fee

సాధారణంగా ఎయిర్‌పోర్టుల్లో పరిమిత లగేజీ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ తీసుకెళ్తే.. అదనంగా చార్జీ చెల్లించాల్సిందే. అయితే.. ఓ వ్యక్తి జాన్ ఇర్విన్ మాత్రం తాను తీసుకెళ్లిన ఎక్కువ లగేజీకీ అదనపు చార్జీలు కట్టడం ఎందుకు దండగ అనుకున్నాడో ఏమో.. ఏకంగా బ్యాగ్ ఓపెన్ చేసి అందులోని చొక్కాలన్నీ ధరించాడు. ఎయిర్‌పోర్టులోనే అందరూ చూస్తుండగానే జాన్.. ఆ చొక్కాలు ధరించాడు. ఈ విచిత్ర ఘటనను గమనించిన జాన్ కొడుకు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటన ఫ్రాన్స్‌లోని నైస్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకున్నది. వాళ్ల లగేజీ 8 కిలోలు ఎక్కువగా ఉండటంతో.. 8 కిలోల బరువైన చొక్కాలను ధరించాడు. దానివల్ల 96 పౌండ్ల చార్జీని తప్పించుకోగలిగాడు. అంటే మన కరెన్సీలో 8206 రూపాయలు అన్నమాట.

అయితే.. మనోడు అన్ని చొక్కాలు ధరించేసరికి ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ సిబ్బంది జాన్‌ను కొంచెం అనుమానంగా చూసి చెక్ చేశారట. షర్ట్స్ అన్నీ విప్పేయాలని చెప్పారట. మనోడు ఒక్కో చొక్కా విప్పుతుంటే అతడు చొక్కాల్లోపల ఏం దాచాడో అని భయంగా చూశారట. కానీ.. చొక్కాల్లో ఏం లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా కాసేపు నవ్వుకొని అతడిని పంపించారట.