మనసుకు నచ్చింది… తెలుగు బులెట్ రివ్యూ

Manasuku Nachindi review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి, అదిత్ అరుణ్ 
నిర్మాతలు :     సంజయ్ స్వరూప్, కిరణ్ 
దర్శకత్వం :    మంజుల ఘట్టమనేని 
సినిమాటోగ్రఫీ:  రవి యాదవ్ 
ఎడిటర్ :   గౌతమ్ రాజు 
మ్యూజిక్ :    రధన్ 

సూపర్ స్టార్ కృష్ణ కూతురు, ప్రిన్స్ మహేష్ బాబు సోదరి ఘట్టమనేని మంజుల. ఈమె తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘మనసుకు నచ్చింది’… సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఘట్టమనేని మంజుల కూతురు స్పెషల్ రోల్ చేసింది. మహేష్ బాబు అక్క సినిమా అవ్వడం వలన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మరీ ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందో? లేదో ? తెలియాలంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే…

కథ :

సూరజ్ (సందీప్ కిషన్), నిత్యా (అమైరా దస్తూర్) వాళ్ళిద్దరూ బావ మరదళ్ళు, మరియు మంచి స్నేహితులు కూడా, వాళ్ళ స్నేహాన్ని ప్రేమ అనుకోని వాళ్ళ పెద్దలు పెళ్లి ఫిక్స్ చేస్తే, ఆ పెళ్లి ఇష్టం లేక వాళ్ళు ఇంటి నుంచి గోవా కి పారిపోతారు. సూరజ్ కి ఫోటోగ్రఫి అంటే ఇష్టం, నిత్యా కి ప్రకృతి అంటే ఇష్టం… గోవా లో నిత్యా మెడిటేషన్ క్లాసులు స్టార్ట్ చేస్తుంది. ఆ క్లాసు కి నికిత అలియాస్ నిక్కీ (త్రిదా చౌదరి) జాయిన్ అవుతుంది. నిక్కీ ని సూరజ్ ప్రేమిస్తాడు, నిక్కీ కూడా ప్రేమిస్తుంది. ఒకరోజు నిత్యాకి సూరజ్ మీద ఉన్నది స్నేహం కాదు ప్రేమ అని తెలుస్తుంది. సూరజ్ ప్రేమకోసం నిత్యా… సూరజ్ కి నిక్కీ మీద ఉన్న ప్రేమని ఎలాగైనా బ్రేక్ అప్ చేయించాలని చూస్తుంది, కానీ సూరజ్ కి ఇష్టం లేదని తెలిసి అభయ్(నవీన్) లవ్ ని ఓకే చేస్తుంది. వాళ్ళిద్దరికీ వేరు వేరు పెళ్లిళ్లు ఫిక్స్ అవుతాయి. కానీ ఒకరోజు సూరజ్ నిత్యా మీద ఉన్నది స్నేహం కాదు ఇష్టం అని తెలుసుకుంటాడు. మరి సూరజ్ తన లవ్ గురించి నిత్యా కి చెపుతాడా? వారిద్దరి పెళ్లిళ్లు జరుగుతాయా? అసలు నిత్యా కి, సూరజ్ కి వాళ్ళది స్నేహం కాదు ప్రేమ అని ఎలా తెలుస్తుంది.? వీళ్ళ పెళ్ళిళ్ళకి పెద్దల రియాక్షన్స్ ఏంటి? ఇవన్ని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ?

విశ్లేషణ:

ఈ సినిమాలో సందీప్ కిషన్ నటన పర్వాలేదు, కానీ ఎమోషనల్ సీన్స్ లో నటించడంలో సందీప్ కిషన్ విఫలం అయ్యాడు. అమైరా దస్తూర్ తెలుగులో మొదటి సినిమా అయిన కూడా చాలా బాగా చేసింది. నటనలోను, ఎమోషన్ సీన్స్ లో ఆదరగొట్టింది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. ఇంకో హీరోయిన్ త్రిదా చౌదరి, చెప్పుకోతగ్గ క్యారెక్టర్ కాదు. కానీ ఉన్నంతలో తన పాత్రకు ఆమె న్యాయం చేసింది. ఈ సినిమాలో మంజుల కూతురు ‘జాహ్నవి’ తన నటనతో, తన టైమింగ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంజుల చెప్పినట్టు చాలా వరకు బాల్యంలో ‘మహేష్ బాబు’ ఎలా అయితే చేసి, అందరిని మెప్పించాడో అలాగే ‘జాహ్నవి’ కూడా చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. సీట్స్ లో కూర్చోటానికి చాలా ఇబ్బంది పడతారు. సెకండ్ హాఫ్ మొదట్లో కొంత బాగుంటుంది, కానీ క్లైమాక్స్ అంతా రొటీన్ గానే ఉంటుంది. ఈ సినిమాలో నాజర్ హీరో హీరోయిన్లు కి తాత గా నటించాడు. నాజర్ ఈ సినిమాకు ‘కీ’ రోల్. ప్రియదర్శి కామెడీ పర్వాలేదు.

‘మహేష్ బాబు’ సిస్టర్ ‘మంజుల’ ఫస్ట్ టైం దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమాకి మంజుల ‘మనసుకు ఏమి నచ్చితే అది చేస్తేనే మనం హ్యాపీ గా ఉంటాము’ అనే స్టొరీ లైన్ తీసుకొని, ఆ కథ కి నేచర్ యొక్క గొప్ప తనాన్ని కలిపి ఈ సినిమాను తెరకేక్కించింది. ఈ సినిమాలో బావ మరదళ్ళ స్నేహం, ప్రేమగా ఎలా మారుతుంది. ఈ ప్రాసెస్ లో వాళ్ళకి ఎదురైనా ఆటంకాలు ఏంటి? చివరికి వాళ్ళు ఎలా కలుసుకుంటారు. ఇలాంటి స్టొరీ స్క్రీన్ ప్లే మనం చాలా సినిమాలలో చూసాం. ఇలాంటి కథనే మంజుల తీసుకొని వర్క్ అవుట్ చేయటంమే ఈ సినిమాకు మైనస్ పాయింట్. ఈ సినిమాకి సినిమాటోగ్రఫి ‘రవి యాదవ్’ ప్రాణం పోసాడు. ప్రతి ఫ్రేమ్ ని ఎంతో అందంగా చూపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ రధన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు, మంచి పాటలు అందించడంలో విఫలం అయ్యాడు. కొన్ని కొన్ని పాటలు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. జెమిని కిరణ్ ఖర్చు కి ఏమాత్రం వెనకాడకుండా బాగా తీసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ …

స్టొరీ లైన్
సినిమాటోగ్రఫీ
జాహ్నవి నటన

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌

మైనస్ పాయింట్స్ …

కథా కథనం
మ్యూజిక్
ఎడిటింగ్
కామెడీ

తెలుగు బులెట్ రేటింగ్ … 2\5