వారిని చెప్పు తీసుకుని కొడతా

manchu lakshmi fires on social media

మంచు లక్ష్మి మాట తీరుపై సోషల్‌ మీడియాలో ఎప్పుడు కూడా ట్రోల్స్‌ వస్తూనే ఉంటాయి. ఎంతో మంది ఆమె మాట తీరును అనుకరిస్తూ జోక్స్‌ చేస్తూ ఉంటారు. మంచు లక్ష్మి ఇంగ్లీష్‌ మాట్లాడే తీరుపై సోషల్‌ మీడియాలో ఉన్న ట్రోలింగ్‌ వీడియోలను చూస్తే కడుపుబ్బా నవ్వు వస్తుంది. ఇక కొన్ని ట్రోలింగ్స్‌ హద్దు దాటుతున్నాయి, మరికొన్ని శృతిమించుతున్నాయి. దాంతో మంచు లక్ష్మికి తీవ్ర ఆగ్రహం కులుగుతుంది. తాజాగా ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ అనే చిత్రాన్ని మంచు లక్ష్మి చేసిన విషయం తెల్సిందే. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రం విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన మంచు లక్ష్మి తనపై కొందరు చేస్తున్న ట్రోలింగ్స్‌పై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. చెప్పు తీసుకుని కొట్టాలన్నంత కోపంగా ఉంది అంటూ తన కడుపులోని కోపం అంతా కక్కేసింది.

తనపై ఎన్ని ట్రోల్స్‌ వచ్చినా కూడా ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని మంచు లక్ష్మి తాజాగా తనపై వ్యక్తిగతంగా మరియు తన కుటుంబంపై కూడా ట్రోల్స్‌ వస్తున్న సమయంలో సీరియస్‌గా స్పందించింది. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. తనపై వస్తున్న ట్రోల్స్‌ను ఎప్పుడు చూస్తూనే ఉంటాను, వాటిలో కొన్నింటిని చూసి నవ్వుకుంటాను. కాని కొన్నింటిని చూస్తే కోపం వస్తుంది. నా వ్యక్తిగత విషయాలను మరియు కుటుంబంకు సంబంధించిన విషయాలను విమర్శించే హక్కు ఎవరికి లేదు. నా కుటుంబం ప్రతిష్టకు, నా ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు ట్రోల్స్‌ చేస్తున్నారు. వారిని చెప్పుతో కొడతాను అంటూ హెచ్చరించింది. ట్రోల్స్‌ అనేవి ఒక స్థాయి వరకే ఉండాలి, శృతిమించితే మాత్రం ఎంత దూరం అయిన వెళ్లేందుకు సిద్దం అంటూ ప్రకటించింది. నా ఫ్యామిలీపై బురద జల్లితే నేను సింహంలా మారి పంజా విసురుతాను అంటూ హెచ్చరించింది. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి ట్రోల్స్‌ చేయడం ఏమాత్రం మంచి పద్దతి కాదు అంటూ సోషల్‌ మీడియాలో తనపై వ్యాఖ్యలు చేసేవారిని హెచ్చరించింది.