అవును జగన్ అవినీతిని అంతం చేస్తారట…

ys jagan says he will clear corruption

ఎందుకో తెలీదు కానీ కొన్ని విషయలు తలచుకోగానే కొందరు గుర్తొస్తారు. క్రికెట్ అంటే సచిన్, టెన్నిస్ అంటే సానియా, సినిమా అంటే పెద్ద ఎన్టీఆర్, అంటే ఆయా రంగాల్లో వారు చూపిన అసామాన్య ప్రతిభ వల్ల వారికి అంత క్రేజ్ వచ్చింది అనుకోవచ్చు. అయితే ఏపీలో అవినీతి అంటే గుర్తొచ్చేది జగన్, అసలు జగన్ చేసిన నేరం ఏంటి అనేది సామాన్యులకి ఒక పట్టాన అర్ధం కాదు, ఎందుకంటే అది క్విడ్ ప్రోకో వల్ల జరిగిన వైట్ కాలర్ నేరాలు కాబట్టి. అయితే ప్రతిపక్షంలో జగన్ పార్టీ మాత్రం తమ నేతను ఎవరూ కార్నర్ చేయకుండా ఉండడానికి మా నేత మీద ఉన్నవి అభియోగాలు మాత్రమే ఎక్కడా నిరూపించలేదు అని చెప్పుకోస్తూ ఉంటారు. అయితే అది కోర్టులో నడుస్తున్నా అవినీతి అంటేనే జగన్, జగన్ అంటేనే అవినీతి అనేంతగా ముద్ర పడిపోయింది.

అయితే ఎన్నికలు దగ్గరకి వస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు స్పీడప్ చేయడం మొదలు పెట్టాయి. వారికి కొంచెం అనుకూలంగా ఉండే మీడియా సంస్థల చేత ఇంటర్వ్యూలు, సర్వేలు ప్రారంభించాయి. అలాగే తాజాగా ఒక ఛానల్ జగన్ కి సంబంధించి ఒక ఓ పెద్ద ఇంటర్యూ టెలికాస్ట్ చేసింది. అందులో ప్రత్యెక హోదా మొదలు దాదాపు అన్ని అంశాలు మాట్లాడిన జగన్ ఒక విషయం మీద ఇచ్చిన స్టేట్ మెంట్ మాత్రం హైలెట్ గా నిలిచింది. అదేంటంటే తాను అధికారంలోకి రాగానే అవినీతిని రూపు మాపేసి అయ్యో ఇలా కూడా అవినీతిని ఆపేయోచ్చా అని దేశం అంతా ఆశ్చర్యపోయేలా చేస్తారట. ఇంటర్యూ చేసిన జర్నలిస్ట్ కూడా కూడా ఈ మాటలు విని ఒక సెకన్ బ్లాంక్ అయ్యారు అది వేరే విషయం.
For checking Jagan Ys’s Affadaift Check the below link

Ys’s Affadaift

కానీ ప్రజలకు అంతగా అవగాహన లేని విషయం ఏమిటంటే జగన్ ఆస్తులన్నీ పేపర్ల మీద సూట్ కేసు కంపెనీల పేరుతో ఉంటాయి. లోటస్ పాండ్ ఇల్లు, యలహంక ప్యాలెస్, బెంగుళూరులోని మంత్రి మాల్ ఇవన్నీ జగన్ పేరున కానీ కుటుంబ సభ్యుల పేరున కానీ ఉండవు సూట్ కేస్ కంపెనీల పేర్ల మీదే ఉంటాయి. చివరికి వ్యాపార సంస్థలు కూడా. ఒక్కటీ జగన్ పేరు మీద ఉండదు. అందుకే… తెలుగుదేశం పార్టీ నాయకులు… దమ్ముంటే ఆస్తులు ప్రకటించమని.. సవాల్ చేస్తూంటారు. కానీ జగన్.. లైట్ తీసుకుంటారు. ఎన్నికల అఫిడవిట్‌లో లోటస్ పాండ్ గురించి గానీ యలహంక ఇంటి విషయాన్ని కానీ
ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆ ప్రాపర్టీలు ఆయనకు చెందిన సూట్ కేస్ కంపెనీల పేరు మీద ఉంటాయి. ఇక క్విడ్ ప్రోకో గురించి ప్రస్తావిస్తే తానెప్పుడూ సచివాలయానికి రాలేదని ఏ ఐఏఎస్, ఐపీఎస్ అధికారితో మాట్లాడలేదని చెప్పుకొచ్చారు జగన్. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లోనే లేనని జగన్ చెప్పుకొచ్చారు. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అని జగన్ బీజేపీతో పొత్తు ఉండదని ప్రకటించినా భవిష్యత్ లో అక్రమాస్తుల కేసుల కోసం బీజేపీతో జట్టు కట్టినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.