Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌లో మోహన్‌బాబుకు క్రమశిక్షణకు మారు పేరు అంటూ మంచి ఇమేజ్ ఉంది. మోహన్‌బాబుతో షూటింగ్ అంటే ఇతర నటీనటులు అంతా కూడా టైమ్‌కు సెట్స్‌లో ఉంటారు. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటారు. ఇతరు విషయాల్లో క్రమశిక్షణ లేకుంటే కోపంగా ఉండే మోహన్‌బాబు తన కుటుంబ సభ్యులు మాత్రం క్రమశిక్షణ తప్పినా పట్టించుకోడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. క్రమశిక్షణ అనేది ఇతరులకు మాత్రమేనా, నీ కొడుకుకు క్రమశిక్షణ అవసరం లేదా అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచు మోహన్‌బాబును ఉద్దేశించి అంటున్నారు. మోహన్‌బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ ఒక పబ్‌లో చేసిన అల్లరి ఈ వివాదాన్ని తెరపైకి తీసుకు వచ్చింది.
వారం రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని ఒక పబ్‌లో మంచు మోహన్‌బాబు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు. లేట్ నైట్ అవ్వడంతో పబ్‌లో సౌండ్స్‌ను తగ్గించారు. పోలీసుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పబ్ వారు చెప్పినా కూడా మనోజ్ సౌండ్స్ పెట్టాల్సిందే అంటూ పట్టుబట్టాడు. సౌండ్స్‌ను పెంచేందుకు వారు నిరాకరించడంతో స్పీకర్స్‌ను మంచు మనోజ్ బద్దలు కొట్టాడు. దాంతో పబ్ నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసుల వెంటనే రంగ ప్రవేశం చేసి మంచు మనోజ్‌ను ఆపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తాను సౌండ్ తగ్గించమంటే తగ్గించలేదు అందుకే బాక్స్‌లు బద్దలు కొట్టాను అంటూ రివర్స్‌లో చెప్పాడు. సీసీ టీవీ ఫుటేజ్ చూసిన పోలీసులకు మంచు మనోజ్ తప్పు చేశాడు అంటూ నిర్థారణ అయ్యింది. అయితే పబ్ యాజమాన్యం మాత్రం మనోజ్‌పై కేసు నమోదుకు ఆసక్తి చూపించలేదు. దాంతో పోలీసులు అక్కడ నుండి వెళ్లి పోయారు. క్రమశిక్షణ కలిగిన తండ్రి కొడుకు అయ్యి ఉండి మనోజ్ ఇలా చేయడం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.