జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు కానీ ఆచరించే విధానాలు కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో అయితే ఒక్కరు కూడా ఉండలేరని ముమ్మాటికీ చెప్పొచ్చు.తాను చెప్పదలచుకునే పాయింట్ ను ఎంత ఆవేశంగా చెప్పగలరో అదే సమయంలో చాలా క్షుణ్ణంగా నిశితంగా ఆలోచింపజేసేలా కూడా చెప్పగలరు.ఇలా మాత్రం ఉన్నది ఉన్నట్టుగా అర్ధం అయ్యేలా పవన్ లా మరో రాజకీయ నాయకుడు చెప్పి ఉండకపోవచ్చు.
ఇప్పుడు అలాంటి భావజాలమే ప్రముఖ సినీ హీరో మంచు మనోజ్ లో కూడా కనిపిస్తుంది.ఇటీవలే జరిగిన దారుణ ఘటన ప్రతీ ఒక్కరినీ ఎంతగానో కదిలించి కలచి వేసింది.దీనిపై మనోజ్ చేసిన కామెంట్స్ వింటే మాత్రం సమాజం పట్ల మనోజ్ ఎంత పరిణితితో ఆలోచిస్తున్నారు,ఎంత భాద్యతగా ఉన్నారో అర్ధం అవుతుంది.ఇది వరకు ఎవరికైనా సాయం కావాలని అంటే మొదట చెయ్యి అందించే మంచు మనోజ్ దాదాపు పవన్ లానే మాట్లాడారు.
సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు కోసం చాలా వాస్తవంగా ఏం జరుగుతుందో స్పష్టంగా మాట్లాడారు.అలాగే మార్చగలిగే సత్తా ఉన్న ప్రభుత్వాలు చట్టాలు ఎందుకు మారడం లేదని ప్రశ్నించి దీనిపై తన సపోర్ట్ ఎంతవరకు అయినా ఉంటుందని తాను తప్పకుండ వస్తానని అన్నారు.ఈ మాటలు మాత్రం తనలోని మరో కోణాన్ని ఏదో మార్పు కోసం పడుతున్న తాపత్రయాన్ని చూపిస్తుంది.ఓ రకంగా చెప్పాలి అంటే పవన్ మరియు మనోజ్ ల భావజాలాలు ఒకింత చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పాలి.