Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రస్తుతం టాలీవుడ్లో పెను దుమారం రేగిందని, శ్రీరెడ్డికి ‘మా’ సభ్యత్వం ఇవ్వం అంటూ ప్రకటించడంతో పాటు, ఆమెతో ఎవరు నటించినా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ ‘మా’ సభ్యులు ప్రకటించిన నేపథ్యంలో శ్రీరెడ్డి కాస్త శ్రీశక్తిగా మారి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. శ్రీరెడ్డి చేస్తున్న ప్రస్తుత ఘాటు విమర్శలకు ‘మా’ ఒక కారణం అంటూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మా’ అనాలోచిత నిర్ణయాలు, ఏక పక్ష వైఖరిపై యంగ్ హీరో విష్ణు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేసిన విష్ణు ‘మా’ తీరుపై తప్పుబట్టాడు.
మంచు విష్ణు ఆ లేఖలో… మా ఇట్లో తండ్రి, తమ్ముడు, సోదరి నేను ‘మా’ సభ్యులుగా ఉన్నాం, మేం ఎవరితో నటించేది నిర్ణయించేందుకు వారు ఎవరు, ఎవరితో నటించకూడదు అనే విషయాన్ని వారు నిర్ణయించకూడదు అంటూ ‘మా’ మంచు విష్ణు వ్యాఖ్యలు చేశాడు. మమ్ములను ‘మా’ ఎలా డిక్టేట్ చేస్తుందని విష్ణు ప్రశ్నించాడు. ‘మా’ చేసిన నిర్వాకం వల్ల ప్రస్తుతం టాలీవుడ్ పరువు పోయిందని మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. టాలీవుడ్లో ఉన్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై కూడా మంచు విష్ణు స్పందించాడు. కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా సినిమా పరిశ్రమ ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా మంచు విష్ణు సూచించాడు. మొత్తానికి ఒక స్టార్ హీరో ‘మా’పై విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.