Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమాలో హీరోలు మంచి వారిగా, సమాజానికి మెసేజ్ ఇచ్చే వారిగా కనిపిస్తారు. కాని సినిమాల్లో వారి హీరోయిజం, బయట మాత్రం వారు సాదారణ జనాల మాదిరిగానే ఆలోచిస్తారు అనే విషయం మరోసారి రుజువు అయ్యింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న మంచు విష్ణు మగ పిల్లాడి కోసం మరోసారి ప్రయత్నించడం జరిగింది. పైకి మాత్రం తనకు కొడుకు కావాలని ఏమీ లేదని, అమ్మాయిలు అయినా కూడా తనకు వారసులే అంటూ చెప్పుకొచ్చాడు. కాని ముందుగానే మంచు విష్ణుకు తన భార్య జన్మనివ్వబోతుంది ఒక మగ అబ్బాయికి అని తెలుసు అని, అందుకే ఆయన పైకి అలా చెప్పుకొచ్చాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
మంచు విష్ణు ముగ్గురు పిల్లలకు తండ్రి అవ్వడంను కొందరు తప్పుబడుతున్నారు. భారతదేశ జనాభా అంతకు అంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే అంటూ ప్రభుత్వాలు ప్రచారం చేస్తుంటే మంచు విష్ణు మాత్రం ముగ్గురికి తండ్రి అవ్వడంను తప్పుబడుతున్నారు. ఒక హీరో అయ్యి ఉండి ఇలా ముగ్గురికి తండ్రి అయితే సమాజం కూడా ఆయన్ను అనుసరించే అవకాశం ఉందని కొందరు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై సినీ వర్గాల వారు కూడా మంచు విష్ణును విమర్శిస్తున్నారు. మంచు విష్ణు చేసిన పని ఏమాత్రం సరిగా లేదని, ఆయన ఇద్దరితో ఫుల్స్టాప్ పెడితే అభినందనీయుడుగా ఉండేవాడు అంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం వారు అంటున్నారు. అయితే కొందరు మాత్రం పిల్లలు అనేది ఆయన వ్యక్తిగత విషయం, అందులో ఇతరుల సలహాలు, ఇన్వాల్వ్ మెంట్ సరికాదని అంటున్నారు.