మరో సారి తండ్రయిన మంచు విష్ణు !

Manchu Vishnu, father of another time!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు, విరానికా దంపతులకు మరోసారి అమ్మాయి జన్మించింది. విష్ణుకు ఇప్పటికే ఇద్దరు కవల అమ్మాయిలు, అవ్రామ్ అనే అబ్బాయి ఉన్నారు. కాగా, తనకు మళ్లీ అమ్మాయి పుట్టిందంటూ విష్ణు ట్వీట్ చేశారు. “ఇట్స్ ఏ గాళ్, ఇట్స్ ఏ గాళ్” అంటూ లవ్ సింబల్స్ తో తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఇవాళ శ్రావణ శుక్రవారం, పైగా వరలక్ష్మీ వ్రతం శుభఘడియలు కావడంతో మంచు వారింట ఆనందం వెల్లివిరుస్తోంది. సినీ ప్రముఖులు, బంధుమిత్రులు మంచు విష్ణుకు ఈ ఆనందమయ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.