మద్దెలచెరువు సూరి హత్యకేసులో నిందితుడుగా ఉన్న మంగలికృష్ణను నిన్న నాంపల్లి కోర్టుకు హజరై తిరిగి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదంతా ఒట్టిదే అని ఆయనను హైదరాబాద్ లో వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది. నాంపల్లి కోర్టుకు హజరై తిరిగి వెళుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారని తెలిసింది. దీనికి కారణం ఏంటంటే మంగలికృష్ణ పై హైదరాబాద్ లో దౌర్జన్యం,దాడి,భూకబ్జా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో దుర్గారావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని, వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వాలని మంగలికృష్ణ గత కొంతకాలంగా బెదిరిస్తున్నాడు. ఇందులో భాగంగా మంగలికృష్ణ అనుచరులు దుర్గారావు ఇంట్లో విధ్వంసం సృష్టించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిగా కడప జిల్లా పులివెందులకు చెందిన సమీర్ అనే వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. మంగలి కృష్ణ ఆదేశాల మేరకు మరో నలుగురితో కలిసి దాడి చేసినట్లు సమీర్ ఒప్పుకున్నాడు.
ఇదే కేసుకు సంబంధించి మంగలికృష్ణ ఈరోజు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో లొంగి పోగా న్యాయస్ధానం బెయిల్ మంజూరుచేసింది. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వ్యాపారంలో తనకు భాగస్వామ్యం ఇవ్వాలని మంగళికృష్ణ కొంతకాలంగా బెదిరిస్తున్నాడని సుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుర్గారావు కుమారుడు సుభాష్ ఫిర్యాదు మేరకు మంగళికృష్ణ, అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ 448, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సమీర్, విష్ణువర్ధన్ రెడ్డిలను ఈనెల 5న అరెస్టు చేశారు. ఈ కేసులో మంగళికృష్ణ ఇవాళ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అనంతరం మంగళికృష్ణకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత కృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కృష్ణను కిడ్నాప్ చేశారంటూ అతని అనుచరులు కొంతసేపు హంగామా సృష్టించారు. అయితే ఇటీవల జగన్ పై.. విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి జరిగిన తర్వాత ఆయన హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి చేరారు. అక్కడ ఏర్పాట్లన్నీ మంగలి కృష్ణనే చేశారు. ఆస్పత్రి లోపలి దృశ్యాల్లో మంగలి కృష్ణ వైసీపీ నేతలతో ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉండటం కనిపించిన సంగతి తెలిసిందే.