అన్నా వీడ్ని భయపెట్టాలా చంపేయలా, ‘భయపెట్టాలంటే పంది నిమిషాలు.. చంపేయాలంటే పావుగంట’.. అంటూ కత్తి దూస్తూ ఉగ్రరూపం దాల్చాడు రామ్ కొణెదల. దీపావళి కానుకగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో కొద్దిసేపటి ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. రామ్ చరణ్, బోయపాటి కాంబోలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌తో అంచనాలను పెంచేసింది. టైటిల్‌లో వినయం ఉట్టిపడుతున్నప్పటికీ రామ్ చరణ్‌లో వీరత్వాన్ని చూపించారు దర్శకుడు బోయపాటి. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా చాన్నాళ్ళ తర్వాత దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డి.వీ.వీ.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ‘వినయ విధేయ రామ’ థియేటర్స్‌లో వీరత్వాన్ని ప్రదర్శించనున్నాడు. మరి ఆ వీరత్వానికి శాంపిల్ అదేనండీ టీజర్ చూసేయండి మరి.