బ్రేకింగ్ : ప్రముఖ దర్శకుడు మణిరత్నానికి హార్ట్ ఎటాక్

mani ratnam heart attack

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నానికి ఇవాళ మధ్యాహ్నం గుండెపోటు వచ్చిన్నట్టు తెలుస్తోంది. వెంటనే ఆయనను హుటాహుటిన చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు మణిరత్నానికి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన మణిరత్నం అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోజా, దళపతి, నాయకుడు, ఒకే బంగారం, బొంబాయి, గురు లాంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను మణిరత్నం అందించారు. మణిరత్నం వయసు ఇప్పుడు 62 సంవత్సరాలు. ప్రముఖ నటి సుహాసిని ఆయన భార్య. ఇంతకు ముందు కూడా ఒకసారి ఆయనకీ గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది.