Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుల్లో ఒకరయిన మణిశర్మ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మణిశర్మ తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ ఈ రోజు ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 92 సంవత్సరాలు. నాగయజ్ఞ శర్మ వైయన్ శర్మగా సంగీత ప్రియులకు సుపరిచితుడే. ఆయన వయోలిన్ విద్వాంసులు. వైఎన్ శర్మ ప్రోత్సాహంతోనే మణిశర్మ సంగీత దర్శకుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి దాదాపు 175 సినిమాలకు స్వరాలందించారు.
మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ కూడా ఇటీవల ఛలో సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి విజయం అందుకున్నారు. మనవడి మొదటి సినిమా విడుదల అయిన కొద్ది రోజులకే ఆయన కన్ను మూశారు. వైయన్ శర్మ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.