క్యాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే ఎందరో నటీమణులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీనియర్ హీరోయిన్ ‘సుహాసిని మణిరత్నం’ కూడా తాను హీరోయిన్ గా ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళ ఇండస్ట్రీలో బలమైన సినీ నేపథ్యం ఉన్న సుహాసిని లాంటి నటి కూడా ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంతకీ, సుహాసిని మణిరత్నం ఏం మాట్లాడారు అంటే.. నేను హీరోయిన్ గా చేసిన సినిమా ల్లో గ్లామర్ షో చేయాల్సి వస్తే.. చాలా ఇబ్బంది పడ్డాను. అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తే నేను తిరస్కరించేదాన్ని. ఐతే, ఒక సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉంది. పరాయి వ్యక్తి ఒడిలో కూర్చునే సీన్ కాబట్టి ఆ సీన్ ను నేను చేయనని చెప్పేసాను . అదే మూవీ లో హీరోతో కలిసి ఐస్ క్రీమ్ తినే సీన్ కూడా ఉంది. హీరో తిన్న ఐస్ క్రీమ్ ని నేను తినాలని చెప్పారు. వేరే వాళ్లు తిన్న ఐస్ క్రీమ్ ని నేను తినడం ఏమిటని సీరియస్ అయ్యాను. అయితే, తాను చెప్పిన విధంగా చేయాలని కొరియోగ్రాఫర్ నా పై సీరియస్ అయ్యాడు. అయినా నేను అంగీకరించలేదు’ ఆమె చెప్పుకొచ్చారు.