నందమూరి బాలకృష్ణ, క్రిష్ దర్శకత్వంలో రుపొండుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ ఈ చిత్రం రెండు భాగాలుగా నిర్మితమవుతుంది. మొదటి భాగం కథానాయకుడు పేరుతో, రెండోవ భాగం మహానాయకుడు పేరుతో విడుదలవుతుంది. కథానాయకుడి విషయానికి వస్తే ఎన్టీఆర్ బాల్యం, చదువు, సినిమాలోకి ఎలా ప్రవేశించారు అనేది మొదటి భాగం లో చూపిస్తారు. కథానాయకుడు కి సంబందించిన షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. మొదటి భాగంలో టాలీవుడ్ కు చెందినా స్టార్ హీరోస్ అండ్ హీరోయిన్స్ నటించారు. ఈ చిత్రం నుండి ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తుంది.
ఎన్‌టిఆర్ కథానాయకుడులో మొత్తం 11 సాంగ్స్ ఉంటాయి. ఈ సాంగ్స్ మొత్తం కథ మద్యలో అక్కడ అక్కడ వస్తుంటాయట. కావున సినిమాకు ఎక్కడ బోర్ కోటద్దు అంటున్నారు. కీరవాణి సంగీతం ఈ చిత్రంలో అద్బుతంగా ఉంటుందంటున్నారు. కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదలవుతుంది. మహానాయకుడు అదే నెల 24 న విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ ఈ చిత్రంను ఎన్‌బికే ప్రొడక్షన్ పైన నిర్మిస్తున్నారు. బుర్రా సాయి మాధవు మాటలు అందిస్తున్నారు.