ఓ ఉద్యమ ద్రోహి ఇచ్చిన సమాచారం వలెనే ఇదంతా…!

Maoists Releases Audio Tape Over Women Maoist Meen Encounter

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ఆండ్రగూడ వద్ద నాలుగు రోజుల కిందట పోలీసుల కాల్పుల్లో తెలంగాణ జనగామ జిల్లాకు చెందిన మహిళా మావోయిస్టు మీనా అలియాస్ ప్రమీల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆండ్రగూడ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన మావోయిస్టులు ఈ మేరకు వారి ప్రతినిధి కైలాసం ఆడియో టేపును విడుదల చేశారు. ఓ ఉద్యమ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు మావోయిస్టులను చుట్టుముట్టి మీనాను అతి సమీపం నుంచి కాల్చి చంపారని ఆరోపించారు.

mOAISTS-POLICE

కాల్పుల్లో గాయపడిన మీనాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా హతమార్చారని పేర్కొన్నారు. మీనా మృతి మావోయిస్టులకు తీరని లోటని అన్నారు. ఏవోబీలోని ఆండ్రపల్లి, జోడాంబో, పనసపుట్టు తదితర ప్రాంతాల్లోని గిరిజనులను భద్రతా దళాలు చిత్రహింసలకు గురిచేస్తున్నాయని, వారిని మావోయిస్టులుగా ముద్ర వేస్తున్నారని కైలాసం ధ్వజమెత్తారు. కటాఫ్‌ ఏరియాలోని వివిధ మండలాల్లో ఈ దురాగతాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ENCOUNTER