పెళ్లయి భర్తకు దూరంగా ఉంటున్న వివాహిత ఇద్దరు యువకులతో అక్రమం సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కొద్దిరోజుల తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులకి తెలియడంతో వారిద్దరూ గొడవపడ్డారు. ఇదే ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైంది. మొత్తానికి వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు హంతకుడిగా మారి జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడికి చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటూ అదే గ్రామంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలానికి చెందిన నాగేశ్వరరావు నాయక్‌తో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. ప్రకాశం జిల్లాకే చెందిన షేక్ ఖాదర్ బాబావలి(29) అనే వ్యక్తి ఇటీవల మురికిపూడిలో చికెన్ దుకాణం పెట్టుకుని స్థానికంగా నివసిస్తు్న్నాడు.
జల్సాలకు అలవాటు పడిన సదరు మహిళ బాబావలితోనూ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు అతడితో గొడవ పెట్టుకున్నాడు. ఆ మహిళతో బంధాన్ని తెంచుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు. అటు బాబావలితో సన్నిహితంగా ఉండొద్దని హెచ్చరించగా.. తాను ఎంత మందితోనైనా తిరుగుతానని సమాధానం చెప్పింది.
దీంతో కొద్దిరోజుల క్రితమే ఇద్దరూ మద్యం మత్తులో ఘర్షణ పడ్డారు. దీంతో తనకు అడ్డుగా ఉన్న బాబావలిని ఎలాగైనా చంపేయాలని నాగేశ్వరరావు నిర్ణయించుకున్నాడు. మంగళవారం రాత్రి మద్యం పీకల దాకా మద్యం తాగిన బాబావలి ఇంటికి వెళ్లకుండా చికెన్ దుకాణంలోనే నిద్రించాడు. ఈ విషయం తెలుసుకున్న నాగేశ్వరావు అర్ధరాత్రి వేళ దుకాణం షట్టర్ తెరిచి నిద్రిస్తున్న బాబావలిపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా చంపేశాడు.