అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఖైరతాబాద్ ప్రేమ్‌నగర్‌లో నివసించే బి. కీర్తన (27) ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటారు.
ఈ నెల 27వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఇప్పుడే వస్తానంటూ భర్త ప్రేమ్ సాయికుమార్‌కు చెప్పి వెళ్ళి అరగంటైనా తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. బంధుమిత్రుల ఇళ్ళల్లో గాలించినా ఫలితం కనిపించలేదు. తన భార్య కనిపించడం లేదంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని పోలీసులు గాలింపు చేస్తున్నారు.