చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరణ

చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరణ

 వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన జలుమూరు మండలం కొండపోలవలస గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కొర్ను హైమావతి (27) ఇంటిలోనే సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుందని పోలీసులు చెప్పారు. మృతురాలి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొటబొమ్మాళి మండలం వాండ్రాడకు చెందిన చిన్నాల కృష్ణమూర్తి, చిన్నమ్మడు కుమార్తె హైమావతిని కొండపోలవలసకు చెందిన కొర్ను జానకీరావుకు ఇచ్చి 2015లో వివాహం చేశారు.

పెళ్లి సమయంలో రూ. ఏడు లక్షల కట్నం, ఏడు తులాల బంగారంతోపాటు సారె కూడా ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే కొద్ది రోజులకే హైమావతిని అత్తింటివారు వేధించేవారని మృతురాలి సోదరుడు చిన్నాల హరిప్రసాద్‌ ఆరోపించారు. భార్యభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగినా పెద్దల సమక్షంలో పరిష్కరించుకునేవారన్నారు. ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయని, అవి కాస్తా పెద్దవి కావడంతో హైమావతి ఆత్మహత్య చేసుకోవడానికి దారితీశాయని పోలీసులు చెప్పారు. శనివారం రాత్రి కూడా ఇంట్లో గొడవ జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.