ఐపీఎల్‌లో తొలి మహిళా

ఐపీఎల్‌ ఆర్సీబీ జట్టులో తొలి మహిళా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ BCCI చే సృష్టించబడిన ఒక  ట్వెంటీ 20 మ్యాచ్. ఐపియల్ 4లో రెండు కొత్త టీములు వచ్చి 10 టీములు ఉండగా 5వ ఐపియల్లో ఒక టీము తప్పుకోగా 9 టీములు మిగిలాయి. ప్రస్తుత ఐపియల్ లో 9టీములు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాజస్థాన్ రాయల్స్, కత్తా నైట్ రైడర్స్, దక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగలూరు, పుణే వారియర్స్ ఉన్నాయి.

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు టీం ఓ మహిళ ను సహాయక బృందంలో నియమించింది. మహిళకు అవకాశం ఇవ్వడం ఐపీఎల్‌లోనే ఇదే మొదటి సారి. రానున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో నవ్‌నీతా గౌతమ్‌ అనే మహిళను నియమించారని సంబందించిన ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఈ మసాజ్‌ థెరపిస్ట్‌ నవ్‌నీతా గౌతమ్‌ ఆటగాళ్లకు అవసరమైన ఫిజియో సంబంధిత అంశాలను చూడబోనున్నారని తెలిపారు. ఆర్సీబీ జట్టు మహిళని సహాయక బృందంలో చేర్చుకున్న తొలి జట్టుగా నిలిచింది.