అయ్యో జీవిత ని తప్పుగా అనుకున్నారు.

Media Thaught Wrong publicity About Jeevitha

హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో పట్టుబడిన 7 కోట్ల రూపాయల పాత నోట్ల కేసు లో మీడియా రాతల్ని జీవిత రాజశేఖర్ తప్పుబట్టారు. ఆ కేసుకు సంబంధించి పట్టుబడ్డ శ్రీనివాస్ జీవితకు బంధువని సోషల్ మీడియా రాయడంతో ఆమె హర్ట్ అయ్యారు. శ్రీనివాస ఎంటర్ ప్రయిజ్ పేరుతో సాగుతున్న ఆ సంస్థకి చెందిన శ్రీనివాస్ తమ దగ్గర ఓ మేనేజర్ గా పనిచేశాడే తప్ప అంతకు మించి సంబంధం లేదని జీవిత స్పష్టం చేశారు.

ఈ ఘటనతో సంబంధం ఉందని మీడియా చెబుతున్న తన సోదరుడు మురళి శ్రీనివాస్ కిడ్నీ మార్పిడి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఉన్నాడని జీవిత వివరించారు. కావాలనుకుంటే ఆస్పత్రికి వెళ్లి చెక్ చేసుకోండని ఆమె సవాల్ విసిరారు. తమ గురించి ఓ వార్త రాసే ముందు మీడియా కనీసం తమను సంప్రదించకపోవడం ఏంటని ఆమె నిలదీశారు. తప్పుడు వార్త రాసాక ఇప్పుడు తమని వివరణ కోరి ప్రయోజనం ఏంటని జీవిత ఆక్రోశం వ్యక్తం చేశారు.