బొలంగీరు జిల్లా భీమబొయి వైద్య బోధన ఆస్పత్రి విద్యార్థిని నిరుపొమ నొందొ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన సంచలనం రేపింది. థర్డ్ ఇయర్ చదువుతున్న నిరుపొమ బుధవారం రాత్రి 11.40 గంటల వరకు తన సోదరితో చాట్ చేసింది.
ఆ తర్వాత కళాశాల హాస్టల్ గదిలో మృతురాలిగా కనిపించడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని, రోదించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అయితే ఇది హత్యా… ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.