Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఛాంబర్లో ఉదయం నుండి హంగామా సృష్టిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాల్సిందే అంటూ ఫిల్మ్ ఛాంబర్ పెద్దలను కోరేందుకు ఆయన ఇక్కడకు వచ్చినట్లుగా కొందరు చెబుతున్నారు. మొదట పవన్ ధర్నాకు దిగుతాడని లేదా దీక్ష చేస్తాడని అంతా భావించారు. అయితే అలాంటిది ఏమీ లేదని, కేవలం పవన్ లోపల ప్రస్తుతం న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాడని, సాయంత్రం సమయంకు పవన్ బయటకు వచ్చి మీడియా సమావేశం నిర్వహిస్తాడని తెలుస్తోంది. పవన్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున ఫిల్మ్ ఛాంబర్ వద్దకు ఫ్యాన్స్ మరియు సినీ వర్గాల వారు చేరుకుంటున్నారు. ఫిల్మ్ ఛాంబర్‌కు మెగా హీరోలు అంతా కూడా చేరుతున్నారు.
పవన్‌తో పాటు మెగా బ్రదర్ నాగబాబు ఫిల్మ్ ఛాంబర్‌కు రావడం జరిగింది. ఆ వెంటనే సన్నిహితులతో కలిసి అల్లు అర్జున్ ఫిల్మ్ ఛాంబర్ చేరుకున్నాడు. ఆ తర్వాత అల్లు అరవింద్ కూడా ఛాంబర్లో అడుగు పెట్టాడు. అలాగే సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్‌లు కూడా ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చారు. మరికాసేపట్లో చిరంజీవి కూడా ఛాంబర్‌కు రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మెగా హీరోలు అంతా కూడా ఛాంబర్‌కు రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున జనాలు పోగవుతున్నారు. సాయంత్రం సమయంలో ఏం జరుగబోతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ ప్రెస్మీట్లో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడు, వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవాని డిమాండ్ చేస్తాడు అంటూ అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.