మెగా ఫ్యాన్స్‌ కోపం అంతా పోయింది

Mega Fans Are happy with Chiranjeevi Sye Raa Narasimha Reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం కోసం ఫ్యాన్స్‌ దాదాపు పది సంవత్సరాలు ఎదురు చూశారు. చివరి సంవత్సరం మరీ ఎక్కువగా మెగా ఫ్యాన్స్‌ను ఊరించి అదిగో, ఇదిగో అంటూ సంవత్సరం పాటు వాయిదాల మీద వాయిదాలు వేసి ఎట్టకేలకు ‘ఖైదీ నెం.150’ చిత్రాన్ని చేయడం జరిగింది. ఆ సినిమా కోసం ఫ్యాన్స్‌ అంతగా ఎదురు చూసినందుకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇచ్చింది. దాంతో ఫ్యాన్స్‌ అన్ని రోజులు ఎదురు చూపులు మర్చిపోయారు. ఇక ‘ఖైదీ నెం.150’ చిత్రం విడుదలైనప్పటి నుండి చిరంజీవి 151వ చిత్రం గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.

దాదాపు ఆరు నెలల క్రితమే ఉయ్యాలవాడ జీవిత చరిత్రతో సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఆరు నెలలు సమయం తీసుకుని ఇన్నాళ్లకు సినిమాను ప్రారంభించారు. ఆలస్యం అయినా కూడా సినిమాకు సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్‌ రిలాక్స్‌ అయ్యారు. భారీ స్థాయిలో అంచనాలున్న చిరు 151వ చిత్రానికి ‘సైరా నరసింహారెడ్డి’ టైటిల్‌ను పెట్టడంతో ఫ్యాన్స్‌ హృదయాలను గెల్చుకున్నారు. ఇక ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అదిరిపోయేలా ఉంది. యుద్ద వీరుడి జీవిత కథ అంటే ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్‌ కాస్త ఆందోళన చెందారు. కాని మోషన్‌ పోస్టర్‌ చూసిన తర్వాత అనుమానాలు అన్ని కూడా పటాపంచలు అయ్యాయి. ఇన్నాళ్ల ఎదురు చూపులకు మంచి సినిమా రాబోతుందని మెగా ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

తెలుగు, తమిళంకు ఒక్కటే..!

మంచు మనోజ్‌ చిత్రానికి అరుదైన గౌరవం