152వ చిత్రం కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్

152వ చిత్రం కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి చిత్రం ఓవరాల్ గా ఊహించిన స్థాయి విజయాన్ని అందుకోలేదన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రం సరిచెయ్యలేని లెక్కలు అన్ని తన తర్వాత 152వ చిత్రంతో సరి చేస్తారని మెగా ఫ్యాన్స్ అంతా అంటున్నారు.దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎంతగానో ఎదురు చూస్తున్నారు.దీనితో అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచీ కూడా ఒక రూమర్ అలా కొనసాగుతూ వస్తూనే ఉంది.

ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటుగా అయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కలిసి నటించబోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.ఇప్పటికి అవి మరింత బలపడ్డాయి.ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక 20 నుంచి 30 నిముషాల వరకు సీన్లు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది అంతే కాకుండా వీరిద్దరిపై సీన్లను కొరటాల శివ చాలా పకట్బందీగా రాసుకున్నట్టు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.మొత్తానికి మాత్రం ఇప్పటి వరకు వస్తున్న ఈ గాసిప్స్ కాస్త నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పాలి.