కోబ్ బ్రియాంట్ మరియు అతని కుమార్తె మృతి

కోబ్ బ్రియాంట్ మరియు అతని కుమార్తె మృతి

అమెరికా లెజెండరీ బాస్కెట్ బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్ మరియు అతని కుమార్తె గియానా హెలికాఫ్టర్ ప్రమాదం లో దుర్మరణం చెందారు. వీరితో పాటుగా మిగతా సిబ్బందితో సహా ఇంకా 9 మంది మరణించారు. అయితే కోబ్ బ్రియాంట్ మరియు అతని కుమార్తెల మృతదేహాల్ని అధికారులు గుర్తించగా మిగతావారి ని గుర్తించడం కష్టంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అయితే కొబ్ బ్రియాంట్ మరణం తో క్రీడా ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. అతని మృతికి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంతాపం తెలుపుతున్నారు. కోబ్ బ్రియాంట్ బాస్కెట్ బాల్ క్రీడలో తన 20 ఏళ్ల కెరీర్ లో పలు రికార్డులని సాధించారు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున అయిదు సార్లు ఛాంపియన్ గా నిలిచి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారు. 18 సార్లు ఆల్ టైం స్టార్ గా నిలిచారు. 2012 ఒలింపిక్స్ లో యూఎస్ తరపున ఆడి రెండు స్వర్ణ పథకాలు సాధించారు. బ్లాక్ మాంబా గా బాస్కెట్ బాల్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న దిగ్గజ ఆటగాడు. బ్రియాంట్, అతడి కుమార్తె మరణ వార్త తెలిసి షాక్ కి గురయ్యానని,ప్రపంచ స్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు అంటూ ట్వీట్ చేసారు.