యంగ్‌ హీరోలకు ఇది బాగా ఫ్యాషన్‌ అయ్యింది

Venkatesh Varun Tej Multi Starrer Joins The Sankranthi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గతంలో హీరోలు పెద్దగా రిష్క్‌లు తీసుకునే వారు కాదు. తమ సినిమాల్లో ఖచ్చితంగా డూప్‌లను వాడేవారు. ఏదైనా రిష్కీ షాట్స్‌ ఉన్నాయి అంటే ఖచ్చితంగా హీరోల డూప్‌లు సెట్స్‌లో ఉండాల్సిందే. షూటింగ్‌ స్పీడ్‌గా అవ్వాలి అంటే కూడా డూప్స్‌ను ఎక్కువగా దర్శకులు ఆశ్రయించేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. యంగ్‌ హీరోలు అంతా కూడా డూప్‌లపై ఆధారపడాలనుకోవడం లేదు. డూప్‌ లేకుండానే సినిమాలు చేయాలని, ఆ విధంగా అభిమానులను అలరించాలని భావిస్తున్నారు. ఇటీవలే ‘సాహో’ చిత్రం కోసం ప్రభాస్‌ యాక్షన్‌ సీన్స్‌ను చేస్తున్నాడు అంటూ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కూడా డూప్‌లు వద్దంటూ సొంతంగానే రిష్కీ షాట్స్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన కొన్ని సాహసవంతమైన సీన్స్‌ను దర్శకుడు ఎంత చెప్పినా కూడా వినకుండా సొంతంగా చేస్తాను అంటూ వరుణ్‌ డేర్‌ చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు. వరుణ్‌ తేజ్‌ సీన్స్‌ సహజంగా రావానే ఉద్దేశ్యంతో పట్టుబట్టి మరీ రిష్కీ షాట్స్‌ను డూప్‌ లేకుండా చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. ఈమద్య కాలంలో హీరోలు ఎక్కువగా ఇలాగే చేస్తున్నారు. ఆమద్య డూప్‌ వద్దన్న మంచు విష్ణు చిన్నపాటి యాక్సిడెంట్‌కు గురైన విషయం తెల్సిందే. ఆ ప్రమాదంలో హీరో మరియు హీరోయిన్‌లు తృటిలో తప్పించుకున్నారు. అయినా కూడా యంగ్‌ హీరోలు తమ దోరణి తమది అంటూ కానిచ్చేస్తున్నారు.