Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్లో మెగా హీరోల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. సంవత్సరంకు ఒక్కరు ఇద్దరు చొప్పున ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన దాదాపు అందరు హీరోలు కూడా మంచి గుర్తింపును దక్కించుకుని మెగా ఫ్యాన్స్ అభిమానాన్ని చురగొంటున్నారు. మొన్నటి వరకు మెగా హీరోలకు ఇతర హీరోలకు పోటీ ఉండేది. అయితే ఇప్పుడు మెగా హీరోల సంఖ్య పెరిగి పోతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ హీరోల మద్య పోటీ తప్పడం లేదు. తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ మరియు సాయిధరమ్ తేజ్‌ల మద్య పోటీ నెలకొన్న విషయం తెల్సిందే. వీరిద్దరు మొదట ఒకే రోజు తమ సినిమాలతో రావాలని ఫిక్స్ అయ్యారు. అయితే మెగా పెద్దలు వారించడంతో ఒక్క రోజు తేడాతో వీరి సినిమాలు బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాయి.
ఒక్క రోజు తేడాతో వచ్చినా కూడా ఇద్దరు హీరోలు నష్టపోవాల్సి వస్తుందని, అందుకే కనీసం వారం లేదా పది రోజులు గ్యాప్ ఉండేలా సినిమాలు ప్లాన్ చేసుకోవాలని కొందరు సహా ఇస్తున్నారు. ఈ విషయమై అల్లు అర్జున్ కాస్త సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇలాంటి పోటీ ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీలో ఉన్న మెగా హీరోలు అంతా కూడా భేటీ అయ్యి, తమ సినిమాల మద్య పోటీ లేకుండా ఎలా విడుదల ప్లాన్ చేసుకోవాలనే విషయమై చర్చించాలని బన్నీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే మెగా ఫ్యామిలీ హీరోల భేటీ ఉండబోతుందని, అందులో చిరంజీవి కూడా పాల్గొంటాడా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.