మెగాస్టార్‌ రాకతో “ఆ సినిమాకి ” ఓ కొత్త ఊపు రాబోతుంది.

చిరంజీవి గారి రాకతో

గతంలో మంచి కమర్షియల్ సినిమాలను నిర్మించిన భవ్య క్రియేషన్స్‌ సంస్థ తొలిసారి కొత్త తారలతో, కొత్త దర్శకుడితో నిర్మించిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 6న విడుదలకు సిద్ధమవుతోంది. చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించనున్నారు.
మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయనున్నాం. చిరంజీవి గారి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్‌కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్‌’’ అని అన్నారు.
ఇటీవల నిఖిల్ సినిమా ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశారు. నిజానికి చిరంజీవి ప్రమోట్ చేయడం వల్ల నిఖిల్ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ‘ఓ పిట్టకథ’ గురించి చెప్పడానికి వస్తున్నారు. సినిమాలో కంటెంట్ గురించి పక్కన బెడితే చిరంజీవి రాకతో ఇప్పుడు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం ఖాయం.