మెగాస్టార్ “ఆచార్య” చిత్రంలో మరో టాప్ హీరో

మెగాస్టార్ “ఆచార్య” చిత్రంలో మరో టాప్ హీరో

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “ఆచార్య” చిత్రంలో మరో టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ కూడా ఉండబోతున్నారు అన్న వార్తే ఇప్పుడు మహేష్ అభిమానులకు మరియు మెగా అభిమానులకు ఒక పిచ్చ హై ఫీలింగ్ ను ఇస్తుంది.ప్రస్తుతానికి మెగాస్టార్ అయితే ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్నారు.అయితే ఈ సినిమాలో కథ ప్రకారం మరో బలమైన రోల్ డిమాండ్ చెయ్యగా దానిని మొదట రామ్ చరణ్ పోషిస్తారని టాక్ వినిపించింది.

కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఆ రోల్ ను మహేష్ చేయబోతున్నారని బజ్ వినిపిస్తుంది.ఇప్పుడెలాగో మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా ఇంకా ఎలాంటి సమాచారం లేకపోవడం దర్శకుడు కూడా కన్ఫర్మ్ కాకపోవడం వంటివి చిరు సినిమాలో మహేష్ కనిపించబోతున్నారు అన్న అనుమానాలను నిజం చేసే దిశగా పరిస్థితులు మారుతున్నాయి.దీనితో ఇప్పుడు ఇద్దరి హీరోల అభిమానులూ దర్శకుడు కొరటాల శివ మరియు నిర్మాత రామ్ చరణ్ ఇద్దరినీ ఏదొక అధికారిక ప్రకటన ఇవ్వవలసిందిగా కోరుతున్నారు.ఇక మిగిలింది అంతా వీరి చేతుల్లోనే ఉంది వెళ్ళేం చేస్తారో చూడాలి.