డ్యూయల్ రోల్ చేయబోతున్న ఎనర్జిటిక్ హీరో

డ్యూయల్ రోల్ చేయబోతున్న ఎనర్జిటిక్ హీరో

సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న చిత్రం ‘రెడ్’. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రం టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. పోస్టర్ లో రామ్ డ్యూయల్ రోల్స్ అండ్ గెటప్స్ లో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాడు.

శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్నట్టు ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ , మాళవిక శర్మ , అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్నారు