న్యూ లుక్ తో రాబోతున్న” రానా “

న్యూ లుక్ తో రాబోతున్న

రానా ద‌గ్గుబాటి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న `అర‌ణ్య‌’ తెలుగు స‌హా హిందీలో ‘హథీ మేరే సాథి’, త‌మిళంలో ‘కాండన్’ పేర్ల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుద‌ల అవుతుంది. కాగా ఈ యాక్షన్ మూవీలో ఇదివరకెన్నడూ కనిపించని కొత్త అవతారంలో రానా దగ్గుబాటి కనిపిస్తున్నాడట. రానా ఈ సినిమాలో బాణదేవ్ అనే అడవి మనిషి పాత్రలో కనిపించనున్నారు.

ఈ పాత్ర కోసం తన రూపాన్ని ఎలా మార్చుకున్నదీ రానా వెల్లడించారు. ‘డైరెక్టర్ ప్రభు సాల్మన్ నా పాత్రకు సంబంధించి ప్రతిదీ వాస్తవికంగా, సహజంగా ఉండాలని భావించారు. ఎప్పుడూ భారీకాయంతో, దృఢంగా ఉండాలనుకొనే నాకు ఈ స్థాయిలో బరువుతగ్గడం అనేది చాలా క్లిష్టమైన పని. బాణదేవ్ క్యారెక్టర్ కోసం సన్నగా మారడానికి తీవ్రమైన ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నా. అది నాకొక వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్ పీరియెన్స్” అని రానా తెలిపారు.