టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న అమెరికా సెక్స్ రాకెట్ వ్యవహారం మెహ్రీన్‌కు చేదు అనుభవంను మిగిల్చింది. చికాగో టాలీవుడ్ సెక్స్ రాకెట్ వ్యవహారం బయట పడ్డప్పటి నుండి కూడా అమెరికాలోని ప్రతి ఎయిర్ పోర్ట్‌లో కూడా ఇండియాకు సంబంధించిన సినీ తారలను ముఖ్యంగా సౌత్ హీరోయిన్స్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఇమిగ్రేషన్ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. తాజాగా మెహ్రీన్ కౌర్ తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు అమెరికా వెళ్లడం జరిగింది. ఆ సమయంలోనే ఏకంగా ఆరు గంటల పాటు ఎయిర్ పోర్ట్‌లో మెహ్రీన్‌ను ఇమిగ్రేషన్ అధికారులు విచారించినట్లుగా తెలుస్తోంది. తాను ఏ పాపం చేయలేదని, తనకు ఆ వ్యవహారంకు సంబంధం లేదని ఎంత మొత్తుకున్నా కూడా మెహ్రీన్‌ను అంత సులభంగా వదిలి పెట్టలేదట.
ఈ విషయాన్ని స్వయంగా మెహ్రీన్ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. తాను విమానాశ్రమంలో ఉన్నంత సమయం ఏదోలా అనిపించిదని, అక్కడ అధికారులు తనను నీచంగా చూశారు అంటూ మెహ్రీన్ ఆవేదన వ్యక్తం చేసింది. మెహ్రీన్‌ను మాత్రమే కాకుండా సౌత్‌కు చెందిన ఎంతో మంది హీరోయిన్స్‌కు ఇలాంటి అనుభవమే ఎదురు అవుతుందని, గతంలో హీరోయిన్స్ అంటే మంచి పేరు ఉండేదని, కాని ఇప్పుడు హీరోయిన్ అనగానే ఎక్కువగా ఫోకస్ పెట్టి మరీ సెర్చ్ చేసి, ఇమిగ్రేషన్ ప్రశ్నలతో తల నొప్పి తెప్పిస్తున్నారు అంటూ హీరోయిన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను చాలా తరుచుగా అమెరికాలో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు వెళ్తూ ఉంటాను. కాని ఈసారి తాను వెళ్లినప్పుడు ఎదుర్కొన్న అనుభవం గతంలో ఎప్పుడు ఎదుర్కోలేదు అంటూ మెహ్రీన్ ఆవేదనతో చెప్పుకొచ్చింది. కొందరు చేసిన పనికి ప్రస్తుతం పరిశ్రమ అంతా కూడా బలి అవుతుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.