టీవీ9 రాజుగారి నుండి రెడ్డిగారికి….టీడీపీ హస్తం !

meil signs the being the tv9 channel

తెలుగు మీడియా సంస్థలు వరుసగా చేతులు మారుతున్నాయి. ఇప్పటికే జనసేన కోసం తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని ఆదిత్యా గ్రూప్ సంస్థల తరపున న్యూ వేవ్స్ మీడియా 99టీవీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే కొద్దిరోజుల క్రితం మాటీవీ మాజీ వాటాదారు నిమ్మగడ్డ ప్రసాద్ సారధ్యంలో 10టీవీని కొన్నారు. ఇక తాజాగా టీవీ9 కూడా అమ్ముడుపోయిందంటూ ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి టీవీ9 అమ్ముడు పోయొందంటూ ఇప్పటికే పలు రకాల ప్రచారాలు సాగాయి. ముఖ్యంగా టైమ్స్ గ్రూప్ సంస్థలు కొనుగోలు చేసినట్టు రెండేళ్ల క్రితం జోరుగా ప్రచారం సాగింది. తెలంగాణా ప్రభుత్వం టీవీ9 ను బ్యాన్ చేసిన సమయంలో మైహోంమ్స్ రామేశ్వర రావు కూడా టీవీ9ని తీసుకున్నారని ముమ్మర ప్రచారం చేశారు. ఆ తర్వాత కూడా పలు సంస్థల పేర్లు వినిపించాయి. అయినా అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ తరుపున శ్రీనిరాజు ఆధ్వర్యంలోనే రవి ప్రకాష్ ఈ సంస్థను నడుపుతున్నారు. ఈ విషయం పవన్ శ్రీ రెడ్డి ఇష్యూ అయినప్పుడు తెరమీదకు వచ్చింది. అయితే తెలుగు న్యూస్ చానల్స్ లో టాప్ రేంజ్ లో ఉన్న టీవీ9 ని సొంతం చేస్కోవాలని చాలా మంది ప్రయత్నించారు.

pp reddy

కానీ తాజాగా ఈ ఛానల్ ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కీలక కాంట్రాక్టులు నిర్వహిస్తున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ యాజమాన్యం కొనుగోలు చేసిందనే ప్రచారం ఊపందుకుంది. మెగా సంస్థల కృష్ణారెడ్డి ఈ టాప్ తెలుగు న్యూస్ చానెల్ చేజిక్కించుకున్నారనే ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలో పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను చేపట్టి దేశం మొత్తం మీద సివిల్ ఇంజినీరింగ్ లో దిగ్గజమైన ఎల్ అండ్ టీ తో పోటీ పడుతున్న మెగా సంస్థ ఎన్నికలకు ముందు ఈ చానల్ కొనుగోలుకు కారణం చంద్రబాబు అనే మాట వినిపిస్తోంది. మెగా సంస్థలో కాంగ్రెస్ కి చెందిన కొందరు కీలక నేతలకి వాటాలున్నాయనే ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు కారణం ? అని ఎందుకు అంటున్నారంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక మెగా సంస్థల వారికి చంద్రబాబుతో చనువు పెరిగింది. సో చంద్రబాబు సూచనల మేరకు ఈ సంస్థను చేజిక్కిన్చుక్కునారని కానీ రవి ప్రకాష్ టీం అలాగే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఒక వేళ సంస్థను మెగా వారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే రవి ప్రకాష్ కు ఫ్రీడం ఇచ్చి పని చేయించుకుంటారా ? లేదా ? అనేది ప్రస్నార్ధకంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు లాభాల విషయంలో తప్ప పని విషయంలో శ్రీని రాజు అండ్ కో పట్టించుకోలేదు కాబట్టే రవి ప్రకాష్ సారధ్యంలో చానల్ డెవలప్ అయిందని ఇప్పుడు వచ్చే వారు ఆయన్ని ఫ్రీగా పనిచేసుకోనిస్తారా ? అనేది తేలాల్సి ఉంది.