ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సంస్థ ఫీడర్ సర్వీసులను పెంచుతున్నది. ఇప్పటికే హైటెక్‌సిటీ మార్గంలో స్టేషన్ల నుంచి నడిపిస్తున్న ఫీడర్ సర్వీసులను నడిపించేందుకు ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు సిద్ధమవుతున్నది. ఫీడర్ సర్వీసులను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రయాణికులను ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో వీటిని విస్తరిస్తున్నది.
అందులో భాగంగా కొత్తగా హైటెక్‌సిటీ స్టేషన్ నుంచి డీఎల్‌ఎఫ్ కంపెనీ వరకు ఎల్బీనగర్ స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్‌నగర్, నాగోల్ వరకు ఫీడర్ సర్వీసులు నడిపించనున్నారు. హైటెక్‌సిటీ నుంచి డీఎల్‌ఎఫ్ వరకు ప్రారంభించనున్న ఫీడర్ సర్వీసులు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ప్రయాణీకుల కోసం తిరుగుతాయి. ఈ సర్వీసులు 15 నిమిషాల ఫ్రీక్వెన్సీతో రాకపోకలు సాగిస్తుంటాయి. అదేవిధంగా ఎల్బీనగర్ నుంచి ఆపరేట్ చేసే ఫీడర్ సర్వీసులు ఉదయం 7.30 గంటల నుంచి 12.30 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆపరేట్ చేయబడుతాయి. ఐటీ ఉద్యోగులకు ఉపయోగపడేవిధంగా ఉంటాయి. లాస్ట్ అండ్ ఫస్ట్‌మైల్ కనెక్టివిటీలో కొత్తగా నడువనున్న సర్వీసులు కీలకంగా ఉంటాయి.